బాణసంచా ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు చూసుకోవాలి.
ప్రకాశం జిల్లా కంభం లో గవర్నమెంట్ హై స్కూల్ క్రీడామైదానంలో ఉన్నటువంటి క్రాకర్స్ స్టాళ్లను పరిశీలించిన అధికారులు.
ఈ సందర్భంగా మండల తాసిల్దార్ వి కిరణ్ కుమార్. క్రాకర్స్ స్టాల యజమానుల తో మాట్లాడుతూ ఏ ప్రమాదాలు జరగకుండాతగు జాగ్రత్త వహించాలని ప్రమాదాలు జరిగినచో యజమానుల యొక్క లైసెన్స్ రద్దుచేసి చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
అలాగే కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున్ రావు,మాట్లాడుతూ ప్రతి ఒక్క స్టాల్ యజమాని ట్రాఫిక్ కు అంతరాయం జరగకుండా 100 మీటర్ల దూరంలో వచ్చే ద్విచక్ర వాహనాలను నిలిపివేయాలని. అలాగే ప్రమాదాలు సంభవించినచో అత్యవసర డైల్ ఫ్రీ నెంబర్ కి మీ దగ్గర ఉండే చరవాణి ద్వారా సమాచారం అందినచో అగ్నిమాపక సేవ కేంద్రం వారు వచ్చి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటానన్నారు. అయితే ప్రమాదాలు జరగకుండా ప్రతి ఒక్క స్టాల్ వారు ప్రతి ఒక్కరూ డ్రమ్ములో నీళ్లు నింపుకొని. బకెట్ లలో ఇసుక నింపుకొని ఉంచుకోవాలని అలాగే విద్యుత్ తీగల వలన ప్రమాదాలు సంభవిస్తే విద్యుత్ ఏఈ గారికీ సమాచారం అందించాలని యజమానులను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక తాసిల్దార్ కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ మరియు కంభం అగ్నిమాపక కేంద్ర సేవ అధికారి టి వెంకటేశ్వర్లు. రెవిన్యూ సిబ్బంది. ప్రసాద్. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Add
.jpg)
