బాణసంచా లైసెన్స్ వారితో సమావేశం.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా బెస్తవారిపేట తాసిల్దార్ కార్యాలయం లో సమావేశం జరిగింది ఈ కార్యక్రమం లో స్థానిక తాసిల్దార్ జితేంద్ర మాట్లాడుతూ ప్రకాశం జిల్లా కలెక్టర్. పి రాజబాబు ఆదేశాలు మేరకు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బాణా సంచా పేలుడు దుర్ఘటన దృష్టిలో ఉంచుకొని. ఈరోజు బెస్తవారిపేట మండల తాసిల్దార్ వారి కార్యాలయంలో. బాణసంచా లైసెన్సుదారులను సమావేశపరిచి వివిద జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే ఒక్కొక్క స్టాల్ కు ఐదు మీటర్ల దూరంలో ఉండాలని. స్టాల్ దగ్గర డ్రమ్ లతో. నీరు. మరియు ఇసుకా బకెట్లలో నింపుకొని జాగ్రత్తగా ఉంచుకోవాలని.తాసిల్దార్ జితేంద్ర తెలియజేశారు.
బేస్తవారిపేట అసిస్టెంట్ ఇంజనీర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్యుత్ వైర్లు డామేజ్ లేకుండా తగు జాగ్రత్తలు తీసుకొని వచ్చే ప్రజలకు ఆటంకం జరగకుండా జాగ్రత్త వహించాలని ఎస్ఎస్ రావు తెలిపారు.
అగ్నిమాపక సర్కిల్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అలాగే మద్యం సేవించిన వచ్చిన వారు బాణసంచా ఆ పరిసర ప్రాంతాల్లో పేల్చనియొద్దని. 15 సంవత్సరాలు నిండిన చిన్న పిల్లలకు బాణసంచా క్రాకర్స్. ఇవ్వవద్దని ఆయన హెచ్చరించారు. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే మాకు తెలియజేయాలని తగు జాగ్రత్త లు తీసుకోకుంటే లైసెన్సులు రద్దుచేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రంగనాయకులు. పోలీస్ సిబ్బంది.పంచాయతీ కార్యదర్శి రామకృష్ణారెడ్డి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం స్టాల్స్ కు పెట్టే స్థలాన్ని పరిశీలించడం జరిగింది.
Add


