నకిలీ మద్యంపై వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ పోరు బాట.

నకిలీ మద్యంపై వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ పోరు బాట. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

గిద్దలూరు ఇంచార్జ్  కె.పి.నాగార్జున రెడ్డి, ఆదేశాలతో కల్తీ మద్యం కి వ్యతిరేకంగా ఈరోజు గిద్దలూరు నియోజకవర్గంలో వైయస్ఆర్ సీపీ నాయకులు,కార్యకర్తలతో కలిసి వైయస్ఆర్ సీపీ నగర పార్టీ అధ్యక్షులు మానం బాలి రెడ్డి, మండల అధ్యక్షులు బత్తెం ఓబుల్ రావు,రాష్ట్ర అనుబంధ విభాగ సభ్యులు సూర స్వామి రంగా రెడ్డి గారు, చేరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, గిద్దలూరు టౌన్ నందు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయం వరకుర్యాలీ గా వెళ్లి స్థానిక ఎక్సైజ్‌ అధికారులకు వినతిపత్రం అందజేశారు. నారా వారి సారా వద్దు, నకిలీ మద్యం తో ప్రజల ప్రాణాలు తీయవద్దు అంటూ నినాదాలతో కార్యక్రమం సాగింది.

బత్తెం ఓబుల్ రావు మాట్లాడుతూ..నకిలీ మద్యం తయారీ, సరఫరాపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కల్తీ మద్యం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరారు. నకిలీ, కల్తీ మద్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తించి, వారి కుటుంబాలను ఆదుకునేలా తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Add


 

Post a Comment

Previous Post Next Post