నెరవేరిన మరో హామీ "ఆటో డ్రైవర్ల సేవలో " రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం.
రాష్ట్రంలో 2,90,669 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ 436 కోట్లు జమ.
ఏలూరు జిల్లాలో 10,655 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ 15.98 కోట్లు జమ.
ఆటో డ్రైవర్లు దసరా సంతోషం నేడే..
శ్రమజీవులకు గౌరవం, స్వవలంబనకు మరింత ప్రోత్సాహం.
ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్లుకు ఏడాదికి రూ 15 వేలు ఆర్థిక సాయం సద్వినియోగం చేసుకోవాలి.
నూజివీడు లో ఆటో డ్రైవర్ల సేవలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి..
ఏలూరు/ నూజివీడు/ : నూజివీడులో శనివారం సాయంత్రం ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారధి ఖాకీ డ్రస్ ధరించి , పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారులు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి సభాస్థలికి భారీ ఎత్తున ఆటోలతో ర్యాలీ, ఆటోను స్వయంగా నడిపి సభాస్థలిగా చేరుకున్న మంత్రి పార్థసారథి. మంగళహారతులతో ఘన స్వాగతం పలికి మంత్రి నుదుటన మహిళలు కుంకుమ తిలకందిద్దారు.
నూజివీడులోని ప్రభుత్వ ఆసుపత్రి వెనుకవైపుగల నందనంతోటలో ఏర్పాటు చేసిన "ఆటో డ్రైవర్ సేవలో" కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ సంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని మంత్రి కొలుసు పార్థసారథి లాంఛనంగా ప్రారంభించారు. ఆటో డ్రైవర్లు సన్మానం చేసి, నూజివీడు నియోజవర్గం 1996 మందికి రూ 2.99 కోట్లు నమూనా చెక్కును ఆటో డ్రైవర్లకు మంత్రి కొలుసు పార్థసారథి అందజేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్రం, ప్రతి నియోజకవర్గం ఆటో డ్రైవర్ల సేవలో పథకం ఒక పండుగ వాతావరణంలో జరిగాయని, ప్రతి ఆటో డ్రైవరు ఇంటికి వెలుగులు నింపాయని అన్నారు. గత ప్రభుత్వం 10 వేలు చొప్పున 2.30 లక్షలు మందికి రూ 230 కోట్లు మాత్రమే ఇచ్చారని, మన ప్రజా ప్రభుత్వం 15 వేలు చొప్పున 2.91 లక్షలు మందికి రూ 436 కోట్లు అందజేస్తామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యిందని, ఎన్నికల్లో ఇవ్వని హామీలు కూడా నిరుపేదలను దృష్టిలో పెట్టుకుని క్రొత్తపథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. దీపం పథకం -2 ద్వారా ప్రతి నిరుపేద కుటుంబానికి ఒక ఏడాదికి ఉచితంగా మూడు గ్యాసు సిలిండర్లు ఇస్తున్నామన్నారు. దీనివలన ఒక ఏడాదికి 2,500 కోట్లు అదనపు భారమని అయినా కూడా ప్రజా సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం చేస్తున్న ఒక మంచి కార్యక్రమం అన్నారు. సమాజాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, నిరుపేదలను ఆదుకోవాలని అన్నారు. స్త్రీశక్తి పథకం రాష్ట్రంలో 1 కోటి 85 వేలు మంది మహిళలు సద్వినియోగం చేసుకుంటూ ఉచితంగా ప్రయాణాలు చేస్తున్నారని తెలిపారు. తల్లికి వందనం కుటుంబంలో ఎంత మంది ఉంటే అంతమందికి రూ 15 వేలు చొప్పున అందిస్తున్నామని అన్నారు. ఆటో డ్రైవర్ల గ్రీన్ టాక్స్ నుండి వెసులుబాటు కల్పించి ఆదుకున్నామన్నారు. తక్కువ సమయంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం విజయవంతం చేసిందని, ఎక్కడయినా ఒకటి లేక రెండు అర్హులు ఉంటే సంబంధిత ధృపత్రాలతో సచివాలయంలో నమోదు చేసుకోవాలని, వారికి కూడా తప్పనిసరిగా లబ్ధిని అందజేస్తామన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేందుకు స్త్రీశక్తి పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందేనని, పథకం వల్ల నష్టంవాటిల్లు తోందని డ్రైవర్లు చెప్పడంతో స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో వారికి రూ 15 వేలు ఆర్థిక సాయం అందిస్తామని చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం నేడు రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని లాంఛనంగా ముఖ్యమంత్రి విజయవాడలో ప్రారంభించారని అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ సూపర్ జిఎస్టి ప్రకటించారని దీనివలన ఆటో డ్రైవర్ల సోదరులకు క్రొత్త ఆటో కొనుగోలు చేసుకుంటే రూ 24 వేలు వరకు తగ్గుతుందని, అలాగే స్పేర్ పార్ట్స్ , కుటుంబ అవసరాలకు ఏది కొనుగోలు చేసినా జీఎస్టీ ద్వారా మనకు కొంత ఆదా అవుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, విజయవాడ ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు, జెడ్పీ సిఇవో యం.శ్రీహరి, ఉప రవాణా కమీషనరు కరీం, కమర్షియల్ టాక్స్ సహాయ కమీషనరు శ్రీనివాసరావు మండల వివిధ శాఖల అధికారులు, యంపిపి ఆరేపల్లి శిరీష, పురపాలక సంఘం వైస్ ఛైర్మన్ పగడాల సత్యనారాయణ, పురపాలక సంఘం కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు, ఆటో డ్రైవర్ల యూనియన్ నాయకులు, ఆటో డ్రైవర్లు వారి కుటుంబ సభ్యులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

