బెల్ట్ షాపులను పూర్తిగా అరికట్టాలి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీసులకు కలెక్టర్ ఆదేశం.


బెల్ట్ షాపులను పూర్తిగా అరికట్టాలి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీసులకు కలెక్టర్ ఆదేశం. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ప్రకాశం జిల్లాలో పూర్తి స్థాయిలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలను అరికట్టేలా ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్  పి. రాజాబాబు, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులను ఆదేశించారు. 

సోమవారం సాయంత్రం ఒంగోలు కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులతో సమావేశమై ఆ శాఖ ద్వారా అమలు జరుగుచున్న కార్యక్రమాల పురోగతిపై సమీక్షించి తగు సూచనలు, ఆదేశాలు జారీచేసారు. 

  జిల్లాలో నాటు సారు తయారీ నిర్మూలనకు తీసుకున్న చర్యలు, బెల్ట్ షాపుల నిర్వాకులపై కేసుల నమోదు, నూతన ఎక్సైజ్ పాలసీ విధానం అమలు తదితర వివరాలను ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీమతి ఆయేషా బేగం, వర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టరుకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పూర్తి స్థాయిలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలను అరికట్టేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలో ఐడి లిక్కర్ పీడిత గ్రామాల్లో నాటుసారా నిర్మూలించి ప్రభుత్వ లక్ష్యం చేరుకునేలా పనిచేయాలన్నారు. 

ఆ వృత్తి నుండి వారి కుటుంబాలను దూరం చేసి సమాజంలో గౌరవప్రదమైన ఉపాధి మార్గాలను వారికి కల్పించేలా ప్రభుత్వం కల్పించే సంబంధిత రాయితీలను, పధకాలను వారికి అందేలా చర్యలు చేపట్టాలన్నారు. 

ఈ సమావేశంలో ఎక్సైజ్ డిప్యూటీ కమీషనర్ శ్రీ హేమంత్ నాగరాజు, అసిస్టెంట్ కమీషనర్ శ్రీమతి విజయ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీమతి ఆయేషా బేగం, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సిఐలు తదితరులు పాల్గొన్నారు.

Add



 

Post a Comment

Previous Post Next Post