ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
తుఫాను ప్రభావంతో నల్లమలలో కురుస్తున్న భారీ వర్షానికి ప్రకాశం జిల్లా కంభం మండలంలోని. రావిపాడు ఎర్రబాలెం బ్రిడ్జి మీదుగా నాలుగు అడుగులు పైన ప్రవహిస్తున్న గుండ్ల కమ్మ వాగు ఈ వరద నీరు మొత్తం చెరువుకు చేరుకుంటున్నాయి. అయితే గుండ్లకమ్మ బ్రిడ్జి దగ్గర పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రజలు ఎవరు కూడా బ్రిడ్జి దాటి రాకుండా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ప్రజలు ద్విచక్ర వాహనదారులు పోలీసులకు సహకరించాలని కోరారు. జిల్లాలో భారీ వర్షాలు పడుతున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎవరే కానీ ఇంట్లో నుంచి బయటకు రావద్దని అత్యవసరమైతేనే బయటకు వచ్చి మీ పనులు ముగించుకొని త్వరగా ఇళ్లకు వెళ్లాలని అధికారులు కోరుచున్నారు. గుండాలు చెక్ డ్యామ్ లు వాగుల దగ్గర తగు జాగ్రత్తలు తీసుకొవాలని ప్రజలకు కంభం సబ్ ఇన్స్పెక్టర్ బి నరసింహారావు. తెలియజేశారు.
