అగ్ని ప్రమాదానికి గురైన బి కే టి కంపెనీని పరిశీలించిన మంత్రి డోల.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కలికవాయిలో నిన్న అగ్నిప్రమాదం జరిగిన బీకేటీ పొగాకు కంపెనీని సందర్శించి పరిశీలించిన మంత్రి డా. స్వామి.
ప్రమాదంలో కాలిపోయిన పొగాకును పరిశీలించిన మంత్రి
కంపెనీలో అగ్ని ప్రమాదం జరగడం దురదృష్టకరమన్నారు.
ప్రమాదంలో రూ.600 కోట్ల విలువైన పొగాకు కాలిపోయింది.
అదృష్టవశాత్తు ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
ఈ ఘటనపై మంత్రులు లోకేష్, అనిత, అచ్చెన్నాయుడు ఆరా తీశారు,బీకేటి కంపెనీకి ప్రభుత్వం తరఫున సాయం అందిస్తామని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలియజేశారు.
Add


