కార్పొరేట్ లకు దేశ సంపదను దోచి పెట్టిన చరిత్ర మోడీ ప్రభుత్వానిదే.

కార్పొరేట్ లకు దేశ సంపదను దోచి పెట్టిన చరిత్ర మోడీ ప్రభుత్వానిదే.

ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ అహర్నిశలు కృషి.

విఎస్. బోస్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు.

          కార్పొరేట్ లకు దేశ సంపదను దోచి పెట్టిన చరిత్ర మోడీ ప్రభుత్వానిదేనని, ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ అహర్నిశలు కృషి చేస్తున్నదని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు విఎస్. బోస్ అన్నారు. సీపీఐ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సమితి సమావేశం ఈసీఐఎల్ లోని నీలం రాజశేఖర్ రెడ్డి భవన్ లో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె. ధర్మేంద్ర అధ్యక్షతన జరగగా, బోస్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. 

      ఈ సమావేశం సందర్భంగా  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఎస్ బోస్  మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వం గడిచిన 12ఏండ్ల కాలంలో బడా కార్పొరేట్ లకు 15లక్షల కోట్ల రూపాయల దేశ సంపదను అక్రమంగా దోచి పెట్టిన నీచ చరిత్రను మూటగట్టుకున్నారని వారు ధ్వజమెత్తారు. గతంలో బడా కార్పొరేట్ శక్తులు ప్రభుత్వం కు 37శాతం పన్ను కడితే, ఈ బీజేపీ హయాంలో దానిని 16శాతానికి తగ్గించారని, దీని కారణంగా దేశ సంపదకు 9లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని ఆరోపించారు.బడా కుబేరులకు యథేచ్ఛగా రాయితీలు ప్రకటించి, సామాన్యుల జీవన పరిస్థితులను దేశ వ్యాప్తంగా దుర్భర స్థితికి మార్చిన చరిత్ర మోడీ ప్రభుత్వానిదని వారు దుయ్యబట్టారు.మోడీ 140కోట్ల ప్రజానీకానికి ప్రధాని కాదని, ఒక శాతం ఉన్న నల్ల కుబేరులకు ప్రధానిగా మారారని ధ్వజమెత్తారు. మోడీ ప్రభుత్వానికి ప్రజలపై చిత్తశుద్ధి ఉంటే దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను మూస్తూ, కార్పొరేట్ లకు రెడ్ కార్పెట్ ఎందుకు వేస్తున్నాడో స్పష్టం చేయాలన్నారు. అందుకే సీపీఐ జాతీయ స్థాయిలో ప్రజలు, కార్మికుల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తున్నదని తెలిపారు.ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కార సాధనకు ఉద్యమాలు నిర్మిస్తుందని అన్నారు.

           ఈ సందర్భంగా  సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఉమా మహేష్ . మాట్లాడుతూ మేడ్చల్ జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయని, వీటిని మండలాల వారీగా గుర్తించి పోరాటాలకు సిద్ధం అవుతున్నామని, అదే విధంగా రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ పార్టీ ద్వారా పోటీలో ఉంటామని, ప్రజా సమస్యల పరిష్కారమే సీపీఐ ప్రధాన అజెండా అని వారు అన్నారు. బీసీ బిల్లును బీజేపీ ప్రభుత్వం గవర్నర్ వ్యవస్థ ద్వారా నష్టపరుస్తున్నదని, అందుకే రాష్ట్రంలో బీజేపీ నాయకులను ప్రశ్నించాలని వారు డిమాండ్ చేశారు.

          ఈ సమావేశంలో సీపీఐ మేడ్చల్ జిల్లా కార్యవర్గ సభ్యులు డి.జి.సాయిలు గౌడ్,జీ. దామోదర్ రెడ్డి,స్వామి, శంకర్,లక్ష్మి, కిషన్, హరినాథ్, శ్రీనివాస్,సత్యప్రసాద్, జి.కృష్ణ,నిమ్మల నర్సింహా, కౌన్సిల్ సభ్యులు దశరథ్, యాదయ్య, యాదగిరి, పరమేశ్వర, మాధవి, ప్రమీల, రమేష్, నరేంద్ర ప్రసాద్,బాపిరాజు,రాములు, బాబు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post