మద్యం సీసాల పై హిల్ కోడ్ అవగాహన కల్పించిన ఎక్సైజ్ అధికారులు.



 మద్యం సీసాల పై హిల్ కోడ్ అవగాహన కల్పించిన ఎక్సైజ్ అధికారులు. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు

 ప్రకాశం జిల్లా కంభం ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో గల 11 మద్యం షాపులను తనిఖీ చేయడం జరిగింది. 

తనిఖీల సందర్భంగా ప్రతి నౌకర్‌నామాదారుడికి “ ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా మాత్రమే ప్రతి మద్యం బాటిల్‌ను అమ్మవలసిందిగా ఎక్సైజ్ అధికారులు సూచనలు ఇవ్వడం జరిగింది.

అలాగే, యాప్ ద్వారా స్కాన్ చేసిన తర్వాత మాత్రమే సదరు బాటిల్ ప్రభుత్వ అధీకృత మద్యం అని గుర్తించబడుతుందని, స్కాన్ కాని బాటిల్స్‌ను వెంటనే పక్కన పెట్టి సంబంధిత ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించి వెరిఫికేషన్ చేయించవలసిందిగా ఆదేశాలు ఇవ్వబడినది.

తనిఖీలలో బీర్ బాటిల్స్‌పై ప్రస్తుతం హీల్ కోడ్ లేకపోవడం వలన అవి స్కాన్ చేయబడలేవని గమనించబడింది. భవిష్యత్తులో బీర్ బాటిల్స్‌పై కూడా హీల్ కోడ్ అమలు చేయబడుతుందని లైసెన్సుదారులకు తెలియజేశారు.

అదేవిధంగా, నౌకర్‌నామాదారులు మరియు లైసెన్సీదారులకు మద్యం అమ్మకాలు ఎంఆర్పీ ధరలకు మించి అమ్మరాదని, ఎక్సైజ్ నిబంధనల ప్రకారం మాత్రమే విక్రయాలు చేయాలన్నారు. గొలుసు షాపులకు మద్యం సరఫరా చేసినట్లయితే సంబంధిత షాపుపై తక్షణమే ఎక్సైజ్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోబడుతాయని హెచ్చరిక ఇవ్వబడింది.

మద్యాన్ని కొనుగోలు చేసే వినియోగదారులకు కూడా ఆంధ్ర ప్రదేశ్ ఎక్సైజ్ సురక్ష యాప్ గురించి అవగాహన కల్పించడం జరిగింది.

Add


Post a Comment

Previous Post Next Post