కంభం చెరువుకు వరద నీరు ఉధృతితో జలకళ.
( ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు )
ఆసియా ఖండంలోనే రెండో పెద్ద చెరువుగా పేరుపొందిన కంభం చెరువు.
అప్పటి శ్రీకృష్ణదేవరాయులు సతీమణి వరదరాజ్యమ్మ చెరువు కట్టను.ఉత్తర దక్షిణ కొండకు ఆనకట్ట కట్టడంతో కంభం చెరువు ప్రసిద్ధి చెందింది.
అల్పపీడన ప్రభావంతో పశ్చిమ ప్రకాశం జిల్లాలో వారం రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నా క్రమంలో జంపలేరు, గుండ్లకమ్మ వాగులు పొంగి పొర్లుతున్నాయి.
వరద నీరు కంభం చెరువులోకి చేరుతుండటంతో కంభం చెరువు జలకళను సంతరించుకుంది. 10 రోజుల క్రితం వరకు కేవలం నాలుగు అడుగుల మాత్రమే చెరువులో నీరు ఉండగా, ప్రస్తుతం వరద నీరు ఆరు నుండి ఏడడుగులకు వరకు వచ్చాయి.
