ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన సీఐ, ఎస్ఐ.
ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు, అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ వారి సూచన మేరకు కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లికార్జున, బేస్తవారిపేట సబ్ ఇన్స్పెక్టర్. రవీంద్రారెడ్డి.బేస్తవారిపేట, అర్ధవీడు, కంభం మండలాలకు సంబంధించిన వ్యవసాయ అధికారులు, మూడు మండలాల లోని పర్టిలైజర్స్ షాపులను తనిఖీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మూడు మండలాలలో యూరియా కొరత లేదని, రైతులకి కావలసిన మోతదులో యూరియా సమృద్ధిగా ఉందఅన్నారు. కావున ఎవరు యూరియా కొరత ఉంది అనే వదంతులు నమ్మవద్దని, రైతులు కూడా కంగారు పడకుండా. అవసరానికి మించి కొనుగోలు చేసి స్టాక్ చేయవద్దని తెలియజేశారు. అలాంటి వదంతులను ఎవరు నమ్మవద్దని తెలిపారు. రైతులకి కావాసినంత యూరియా అందుబాటులో ఉందన్నారు.
