ప్రజాస్వామ్య శిఖరం వావిలాల గోపాలకృష్ణయ్య.
వావిలాల జయంతిలో పాల్గొన్న లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) పల్నాడు జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్.
స్వాతంత్ర పోరాటంలో పాల్గొనడంతో పాటు ప్రజా సంక్షేమం కోసం రాజకీయాల్లోకి వచ్చి వారి శ్రేయోస్సు కై జీవితాంతం పాటుడిన ప్రజాస్వామ్య శిఖరం పద్మభూషణ్ వావిలాల గోపాలకృష్ణయ్య అని లోక్ జనశక్తి పార్టీ(రామ్ విలాస్ ) పల్నాడు జిల్లా అధ్యక్షుడు, న్యాయవాది జొన్నలగడ్డ విజయ్ కుమార్ పేర్కొన్నారు. వావిలాల గోపాలకృష్ణయ్య 120 వ జయంతి సందర్బంగా బుధవారంపల్నాడు జిల్లా సత్తెనపల్లి వావిలాల ఘాట్*లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గాంధేయవాదాన్ని గుండెలు నిండా నింపుకొని దేశం కోసం పోరాడి నీతి, నిజాయితీగా రాజకీయాలు చేసి పలుమార్లు ఎమ్మెల్యే గా గెలుపొంది పాలనలో అనేక సంస్కరణలను తీసుకొచ్చిన ప్రజాస్వామ్య శిఖరం అని పేర్కొన్నారు. *వావిలాల, డాక్టర్. బి.ఆర్. అంబేడ్కర్ స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లో కి వచ్చి 2024 సార్వత్రిక ఎన్నికల్లో సత్తెనపల్లి. ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీచేశాని పేర్కొన్నారు. ప్రతియేటా వర్ధంతి, జయంతి కార్యక్రమంలో క్రమం తప్పకుండా పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులు అర్పిస్తానని ఆయన తెలిపారు. తొలుతా వావిలాల విగ్రహానికి పలువురు పూల మాలతో ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు షేక్.షరీఫ్, సుభాని, కంభంపాటి ఆశీ, అరవింద్ బాబు, ఉద్దండి సాగర్ తదితరులు పాల్గొన్నారు.

