సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెట్లు నరికితే.. ఒక్కో వృక్షానికి రూ. లక్ష జరిమానా .


చెట్లు నరికితే.. ఒక్కో వృక్షానికి రూ. లక్ష జరిమానా .

 సుప్రీంకోర్టు సంచలన తీర్పు 

చెట్లను నరకడం పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తుంది. దీనివల్ల వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని.. వర్షాలు సరిగ్గా పడవు. 

వాయు కాలుష్యం పెరుగుతుంది. ప్రజలు అనారోగ్యం పాలవుతారు. 

అందుకే చెట్లను నరకడం నేరం. 

ప్రతి ఒక్కరికీ పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది. 

చెట్లను నాటి.. వాటిని సంరక్షించాలి. పర్యావరణాన్ని కాపాడితే మన భవిష్యత్తును మనం కాపాడుకున్నట్లేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. 

చెట్లు నరకడం మనిషిని చంపడం కంటే దారుణమని, పర్యావరణానికి నష్టం కలిగించే వారిపై దయ చూపరాదని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. 

అక్రమంగా చెట్లు నరికితే ఒక్కోదానికి రూ. 1 లక్ష జరిమానా విధించాలని స్పష్టం చేసింది.

Post a Comment

Previous Post Next Post