ఏలూరు GH లో ANM లకు, MLHP లకు NCD-4.0 క్యాన్సర్ స్క్రినింగ్ పై శిక్షణా కార్యక్రమం - DMHO Dr. పి. జె. అమృతం.
ఏలూరు, సెప్టెంబరు, 09: ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో ఎన్ సి డి సి డి 4.0 సర్వేలో భాగంగా మంగళవారం క్యాన్సర్ స్క్రీనింగ్ పై అవగాహన కల్పిస్తూ దానికి సంబంధించిన శిక్షణ పిహెచ్ సి మెడికల్ ఆఫీసర్లకు ఇవ్వడం జరిగిందని , ఏఎన్ఎం లకు,ఎంఎల్ హెచ్ పి లకు ఈ శిక్షణ కార్యక్రమం జరుగుచున్నదని డిఎంహెచ్ఓ డా. పి.జె. అమృతం తెలిపారు. ప్రతి డివిజన్లో అనగా జంగారెడ్డిగూడెం డివిజన్ సంబంధించి జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ లో నూజివీడు డివిజన్ సంబంధించి నూజివీడు ఏరియా హాస్పిటల్ లో, ఏలూరు సంబంధించి ఏలూరు డిఎంహెచ్ఓ ఆఫీసు నందు ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం సెప్టెంబర్ 27 వరకు కొనసాగుతాయన్నారు. కార్యక్రమంలో ఓరల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ లలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు నిర్వహించడం జరిగిందన్నారు.
శిక్షణా కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం ఆఫీసర్ నరేంద్ర కృష్ణ, డాక్టర్ హెలీనా, డాక్టర్ అరవింద్ మరియు పిహెచ్ సి డాక్టర్లు పాల్గొన్నారు.

