(ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు)
ప్రకాశంజిల్లా కంభం నందు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమింపబడిన గోన చెన్నకేశవులను కంభం అర్ధవీడు బేస్తవారిపేట మండలాలకు చెందిన ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేస్తూ ఘనంగా పూలమాలతో సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మన పశ్చిమ ప్రకాశమైనా మార్కాపురం డివిజన్ కు రాష్ట్రస్థాయి పోస్టు రావడము చాలా అరుదైన విషయం దీనికి కృషి చేసిన స్థానిక శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసినారు. చెన్నకేశవులు పార్టీకి నియోజకవర్గంలో చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం వారు నియామకం చేపట్టి ఉన్నారు. ఈ కార్యక్రమం నందు చిట్టెం నాగరాజు కాంతారావు నాయక్ అర్ధవీడు మండల విద్యాశాఖ అధికారి 2 లక్ష్మీ నాయక్ ప్రధానోపాధ్యాయులు గోపి నాయక్ వరప్రసాద్ పాల్ మరియు నేత్ర సహాయ వైద్యులు అంజి పాల్గొన్నారు.
