జిల్లా వ్యాప్తంగా నంబర్ ప్లేట్ల పై ఇలా రాస్తే.. ఇక వాహనం సీజ్ ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్.
ఏలూరు జిల్లా...
మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వాహనాలకు నంబర్ ప్లేట్లు లేకుంటే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ హెచ్చరించారు.
నంబర్ ప్లేట్ల పై వారి తాలూకా అని రాసినా, నిబంధనకు లోబడి లేకున్నా వాహనాలను సీజ్ చేస్తామన్నారు.
వీటి తయారీదారులపై చట్టప్రకారం చర్యలు ఉంటాయన్నారు.
నంబర్ ప్లేట్లపై నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ లు చేపట్టాలని పోలీస్ సిబ్బంది కి ఆదేశించారు...
