ట్రాప్ కెమెరాలకు చిక్కిన రేస్ కుక్క.
(ప్రకాశం ప్రతినిధి దాసరి యోబు)
అర్థవీడు:ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో పులుల సంచారాన్ని గుర్తించేందుకు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు రేస్ కుక్క చిక్కింది. నాగార్జునసాగర్ నల్లమల అటవీ ప్రాంతంలో దాదాపు 76 రేస్ కుక్కలు ఉన్నట్లుగా అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. ఇవి చాలా చురుగ్గా ఉంటాయని, అటవీ ప్రాంతాన్ని సంరక్షించడంలో రేస్ కుక్కలు కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు తెలిపారు. పులికి ఎదురు తిరిగే జీవులలో రేస్ కుక్క కూడా ఉంటుందని, పులి వేటాడి తెచ్చుకున్న ఆహారాన్ని గుంపుగా ఏర్పడిన రేస్ కుక్కలు సులభంగా లాక్కుంటాయని అధికారులు వివరించారు.
