గోకవరంలో గాలికుంటి టీకా పోస్టర్ ఆవిష్కరణ.


 

గోకవరంలో గాలికుంటి టీకా పోస్టర్ ఆవిష్కరణ.

పోస్టర్ ఆవిష్కరించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ.


జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జ కె సాయి దుర్గ.

కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గాలికుంటి వ్యాధి నివారణ టీకాలను రైతులు తప్పనిసరిగా పశువులకు వేయించుకోవాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సూచించారు. గోకవరం మండలం కృష్ణునిపాలెం గోపికృష్ణ ఫంక్షన్ హాల్‌లో గోకవరం పశువైద్యశాల వైద్యులు డాక్టర్ లోకేష్ ఆధ్వర్యంలో జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం, గాలికుంటి వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమ పోస్టర్ ఆవిష్కరణ జరిగింది.ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 15 వరకు ఇంటింటికీ వెళ్లి పశువులకు టీకాలు వేయనున్నట్లు తెలిపారు. గాలికుంటి వ్యాధి నివారణ టీకాలను పాడి రైతులు తప్పకుండా వేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్ కుమార్, గోకవరం సొసైటీ చైర్మన్ గాజింగం సత్తిబాబు, మాజీ జడ్పిటిసి సభ్యులు పాలూరి బోసు బాబు, టిడిపి నాయకులు పోసిన ప్రసాద్, భూపతిపాలెం రెసిడెన్షియల్ స్కూల్ చైర్మన్ గల్లా రాము, మల్లవరం ఎంపీటీసీ మరిసే అప్పారావు, యర్రంపాలెం పశువైద్యశాల డాక్టర్ అన్నపూర్ణ నాయుడు, కామరాజుపేట ఏ హెచ్ ఏ సురేష్, గుమ్మల్లదొడ్డి ఏ హెచ్ ఏ వీరబాబు, వెటర్నరీ సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post