9 మంది సిబ్బందికి హెడ్ కానిస్టేబుల్ నుండి ASI గా పదోన్నతి కల్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్.



9 మంది సిబ్బందికి హెడ్ కానిస్టేబుల్ నుండి అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ గా పదోన్నతి కల్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్.

 ( ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు )
          పదోన్నతితో ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు, శాంతి భద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాలని ప్రకాశం జిల్లా ఎస్పీ తెలియజేశారు.

* జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో ఖాళీల ఆధారంగా,9మంది హెడ్ కానిస్టేబుల్‌లకు అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్  హోదాకు పదోన్నతి కల్పిస్తూ, జిల్లా ఎస్పీ  బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పదోన్నతి ఉత్తర్వులను అందజేశారు.
 ఈ సందర్భంగా పదోన్నతులు పొందిన వారిని జిల్లా ఎస్పీ  అభినందించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తూ పదోన్నతి పొందడం ఒక గౌరవకరం అయిన విషయమని, పదోన్నతి పొందిన మీరు మరింత నిబద్ధతతో, అంకితభావంతో విధులు నిర్వర్తించాలని, పోలీస్ స్టేషన్లను ఆశ్రయించే బాధితులకు అండగా నిలబడి, త్వరితగతిన న్యాయం అందించేందుకు నిరంతరం కృషి చేయాలన్నారు. పోలీస్ శాఖ ప్రతిష్ఠను మరింతగా పెంచేలా విధులు నిర్వర్తించాలని,విధి నిర్వహణలో శాఖాపరమైన సహకారం అందించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నామని తెలిపారు.నూతనంగా పదోన్నతి పొందిన ఏఎస్సైలు ప్రజలతో స్నేహపూర్వక వాతావరణాన్ని ఏర్పరచాలని, శాంతి భద్రతల పరిరక్షణ,నేరాలు నియంత్రణ,పాఠశాలలు మరియు కళాశాలల విద్యార్థులకు గుడ్ టచ్ & బ్యాడ్ టచ్,లైంగిక వేధింపులు,పోక్సో చట్టాలపై,మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు,సైబర్ నేరాలు,రోడ్డుప్రమాదాలు, ట్రాఫిక్ నియమాలు మరియు డయల్ 100/112 సేవల గురించి విస్తృతంగా అవగాహన కల్పించటంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు.ఈ పదోన్నతులు వారి బాధ్యతలను పెంచుతాయని,వాటిని సమర్థవంతంగా నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు.
 

Post a Comment

Previous Post Next Post