తప్పిపోయిన బాలుడును 2 గంటలలో వ్యవధిలోనే గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించిన వేలిగండ్ల ఎస్సై కృష్ణ పావని


తప్పిపోయిన బాలుడును 2 గంటలలో వ్యవధిలోనే గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించిన  వేలిగండ్ల ఎస్సై కృష్ణ పావని

  క్రైమ్ 9 మీడియా ప్రతినిధి మద్యాహ్నం సుమారు 02.45 గంటల సమయంలో రాబడిన Dial 100 కాల్ పరిశీలించగా మరపగుంట్ల గ్రామ SC కాలానికి చెందిన చండ్రపాటి  ఇస్మాయిల్ S/o కొండయ్య, వయస్సు 38సం అనునతను తన 11 సం.ల కుమారుడు అయిన చండ్రపాటి రామ్ కుమార్ ని మందలించగా, అంతట రామ్ కుమార్ భయపడి ఇంటి నుండి వెళ్ళిపోయినాడని, ఎంత వెతికినా కనిపించలేదని ఫిర్యాదు చేయడమైనది. సదరు ఫిర్యాదు మేరకు వెలిగండ్ల సబ్ ఇన్స్పెక్టర్  కృష్ణ పావని,ఉన్నతాధికారులకు తెలియపరిచి కనిగిరి డి.ఎస్.పి సాయి ఈశ్వర్ యశ్వంత్  సూచనల మేరకు, పామూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ భీమా నాయక్  ఆద్వర్యంలో, వెలిగండ్ల ఎస్సై మరియు సిబ్బంది హుటాహుటిన మరపగుంట్ల గ్రామానికి చేరుకుని అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్ కెమెరాలను ఉపయోగించి చెట్ల చాటున దాగుకొని ఉన్న బాలుడిని గుర్తించి సురక్షితంగా రామ్ కుమార్ ని వారి తల్లితండ్రులకు అప్పగించడమైనది. బాలుడి ఆచూకీ కనుగొనుటలో త్వరితగతిన స్పందించి సురక్షితంగా రక్షించిన తల్లిదండ్రులు జిల్లా ఎస్పీ ,కి మరియు పోలీస్ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

బాలుడిని గుర్తించుటలో అత్యంత ప్రతిభ కనపరచిన కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ , పామూరు సీఐ భీమా నాయక్ , వెలిగండ్ల సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణ పావని మరియు వారి సిబ్బందిని ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ ఏ ఆర్ దామోదర్ , ప్రత్యేకంగా అభినందించారు.

Post a Comment

Previous Post Next Post