చింతలపూడి నియోజకవర్గం కామవరపుకోట మండలం సొసైటీ చైర్మన్ ల ప్రమాణ స్వీకారం లో అప్కాబ్ చైర్మన్ వరాల జల్లు.
రైతన్నల సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన ఘంటా మాధవరావు...
అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తుంది అంటున్న అప్కాబ్ చైర్మన్ తో పాటు,చింతలపూడి ఎమ్మెల్యే.
కామవరపుకోట LACS సొసైటీ చైర్మన్ ఘంటా మాధవరావు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న అప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, స్థానిక ఎమ్మెల్యే రోషన్ కుమార్.
నూతనంగా ఎన్నికైన చైర్మన్ డైరెక్టర్లతో ప్రమాణ స్వీకారం చేపించి సొసైటీ అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందన్న జిల్లా టిడిపి పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు.
సొసైటీలు బాధ్యతాయుతంగా పనిచేస్తే, ప్రతిఫలం ప్రతి రైతు ఇంటికీ చేరుతుందన్న ఎమ్మెల్యే
సొసైటీ అభివృద్ధి చెండడానికి సహకరించగలరు అని అడిగిన వెంటనే మీకు ఏ సహాయం కావాలన్న కాదనకుండా చేస్తాను అని హామీ ఇచ్చారు,
మూత పడిన పెట్రోల్ బంక్ పునః ప్రారంభం నకు కృషి చేస్తాను అన్నారు,
రానున్న రోజుల్లో నియోజకవర్గంలోని రైతుల అభ్యున్నతికి ప్రణాళికబద్ధంగా పని చేస్తామన్న చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్.
ఈ కార్యక్రమంలో మండల కూటమి నాయకులు కార్యకర్తలు రైతులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
Tags
latest news
