తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు చేయూత.




తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు చేయూత.
 
( ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా జిల్లా ప్రతినిధి )
          ప్రకాశం జిల్లా కంభం మండలం జగ్గంబొట్ల కిష్టాపురం గ్రామంలో తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మిగిలిన ముగ్గురు పిల్లలకు ఓర్నాన్ ఫౌండేషన్ తరపున నిత్యవసర సరుకులు, వారి చదువులకు కొంత ఆర్థిక సహాయము చేయటం జరిగింది. ఈ సందర్భంగా ఓర్నాన్  ఫౌండేషన్ పౌండర్ మరియు చైర్మన్ బద్దీటి అల్లూరయ్య మాట్లాడుతూ ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో ఉన్న చిన్నారులను ఆదుకోవడం చాలా సంతోషంగా ఉందని  అన్నారు.
అంతేకాకుండా ముందు ముందు కుటుంబానికి ఆసరాగా ఉంటానని మాట ఇచ్చారు.ఈ సందర్భంగా గ్రామస్తులు అల్లూరయ్యకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఓర్నాను ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post