నందిగామలో స్త్రీ శక్తి కార్యక్రమం.
నందిగామ పట్టణం వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు నందు మంగళవారం నాడు స్త్రీ శక్తి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెదేపా అంగన్వాడీ, డ్వాక్రా సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఆచంట సునీత , నియోజకవర్గ పరిశీలకులు బచ్చుల సుబ్రమణ్యం బోస్ \,ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హాజరయ్యారు.
మొదటగా స్త్రీ–శిశు సంక్షేమశాఖ వారు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను విప్, ఎమ్యెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య పరిశీలించి, అక్కడి మహిళలతో పరస్పర చర్చలు జరిపారు. అనంతరం మాట్లాడిన తంగిరాల సౌమ్య రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా పక్షపాతి అని వివరించారు. వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయల పెన్షన్ పెంచడానికి ఐదేళ్లు సమయం తీసుకున్నప్పటికీ, చంద్రన్న కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఒకేసారి 1000 రూపాయలు పెంచారని గుర్తుచేశారు.
అలాగే “తల్లికి వందనం” పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే వారందరికీ 15,000 రూపాయలు లభించేలా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు దని పేర్కొన్నారు. ఒక మైనారిటీ కుటుంబానికి చెందిన 14 మంది పిల్లలందరికీ తల్లికి వందనం పథకం ద్వారా సహాయం అందిందని ఉదాహరణగా చెప్పారు.
డ్వాక్రా వ్యవస్థ ద్వారా కోటి మంది మహిళలకు శక్తివంతమైన వేదికను అందించిందీ, సూపర్ సిక్స్ పథకాల ద్వారా సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా ముందుకు తీసుకువెళ్తున్నారని విప్, ఎమ్యెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నా, చంద్రబాబు నాయుడు అభివృద్ధిని, సంక్షేమాన్ని జోడెడ్లుగా నడిపిస్తున్నారని కొనియాడారు. అలాగే మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేసిన విషయం గుర్తుచేశారు.
కార్యక్రమం ముగింపు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మహిళలతో కలిసి ఫోటో సెషన్‌లో పాల్గొని వారిని అభినందించారు.
నందిగామ పట్టణంలో జరిగిన ఈ స్త్రీ శక్తి కార్యక్రమం మహిళా శక్తి ప్రతిభను ప్రతిబింబించడమే కాకుండా, ప్రభుత్వ సంక్షేమ పథకాల విజయాన్ని కూడా చాటిచెప్పింది. స్త్రీ శక్తి కార్యక్రమములో చిన్నారుల నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అలానే కళాశాల విద్యార్థినులు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అమలు చేస్తున్న విధానాన్ని కొనియాడారు. మొత్తం కార్యక్రమంలో సభ ప్రాగణంలో ఏర్పాటు చేసిన ఉచిత బస్సు మరియు గ్యాస్ సిలిండర్ సూపర్ సిక్స్ హామీల నమూనాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో లాల్ బహుదూర్ లెఫ్ట్ కెనాల్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోట వీరబాబు, కంచికచర్ల మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి వెంకట సత్యనారాయణ బాబు, నందిగామ మున్సిపల్ చైర్ పర్సన్ మండల కృష్ణకుమారి, వివిధ హోదాల చైర్మన్లు, వైస్ చైర్మన్లు,విద్యార్థినులు,మహిళలు, క్లస్టర్ యూనిట్ ఇన్చార్జిలు, కూటమి నేతలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
.jpeg)

.jpeg)
