ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు..
* సర్వవిఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు ప్రజలకు సుఖ సంతోషాలను ప్రసాదించాలి..
* శాంతి సౌభాగ్యాలతో రాష్ట్రం మరింత ప్రగతి పథంలో నడిచేలా అనుగ్రహించాలి..
* పలు డివిజన్ లో జరిగిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు.
ఏలూరు, ఆగస్టు 27:- సర్వవిజ్ఞాలను తొలగించే ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని, ప్రతి ఒక్కరికీ శుభాలు, విజయాలు కలగాలని, ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఆ వినాయకుడిని ప్రార్థిస్తున్నట్టు ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పల నాయుడు తెలిపారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం వీర మహిళల ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నాలు తొలగిపోవాలని విజ్ఞేశ్వరుని పూజించడం ద్వారా అందరికీ జీవితంలో కష్టాలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయి అన్నారు వినాయక చవితి పర్వదినం ప్రజలకు ఆనందం నింపాలని ప్రతి ఇంటిలో ఐకమత్యం సౌభ్రాతృత్వం నెలకొనాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని వినాయకుని ప్రార్ధించారు రాష్ట్రం అన్ని రంగాల్లో మరింతగా అభివృద్ధి పథంలో దూసుకుపోయే విధంగా గణనాథుడు ఆశీర్వదించాలని పేర్కొన్నారు. అదే విధంగా వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సదుపాయం కల్పిస్తూ జీవో జారీ చేయాన్ని రెడ్డి అప్పల నాయుడు స్వాగతించారు.. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి లోకేష్ గారికి రెడ్డి అప్పల నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏలూరులో పలు డివిజన్ లో జరిగిన వినాయక చవితి మహోత్సవానికి నిర్వాహకుల ఆహ్వానం మేరకు స్వామి వారిని దర్శించుకున్నారు. న్యూ ఫిష్ మార్కెట్ లో ఉన్న వరసిద్ధి వినాయక స్వామి వారి మహోత్సవానికి, మార్కెట్ యార్డులో నిమ్మకాయల వర్తక సంఘం వారి అధ్వర్యంలో జరిగిన వినాయక మహోత్సవానికి, రామానగర్ కాలనీలో వెలసిన ఆంజనేయ స్వామి వారి దేవస్థానం లో జరుగుతున్న వినాయక చవితి మహోత్సవానికి, చెంచుల కాలనీలో శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో జరుగుతున్న వినాయక చవితి మహోత్సవానికి హాజరై స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జనసైనికులు, మెగా అభిమానులు పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా ప్రజలు పర్యావరణ రహితంగా, సంప్రదాయ బద్ధంగా వేడుకలు జరంపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


.jpeg)
.jpeg)

.jpeg)

.jpeg)
