హసనాపురం గ్రామంలో చిరుత పులి పిల్ల.
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం హసనాపురం గ్రామ సమీపంలోని అమరావతి, అనంతపురం జాతీయ రహదారిపై చిరుత పులి పిల్లను గ్రామస్తులు పట్టుకున్నారు.
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు , పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని చిరుత పులి పిల్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
చిరుత పులి పిల్ల ఒంటిపై గాయాలు ఉండడంతో పులి పిల్లను చికిత్స కోసం వైద్యశాలకు తరలించేందుకు అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
