లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన తాండూరు పురపాలక సీనియర్ అసిస్టెంటు.





లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన తాండూరు పురపాలక సీనియర్ అసిస్టెంటు.

TELANGAANAఆగస్టు 19, 2025  

రంగారెడ్డి జిల్లా,: తాండూరులో అవినీతి మరొకసారి వెలుగులోకి వచ్చింది. తాండూరు పురపాలక కార్యాలయంలో సీనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్న బి. రమేష్ అనే అధికారి లంచం తీసుకుంటూ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డాడు.
ఫిర్యాదుదారుడు తాను నిర్మించుకున్న ఒక షెడ్డుకు ఇంటి నంబర్ కేటాయించాలనగా, అందుకు ప్రతిగా ₹15,000 లంచం కోరిన రమేష్‌ను, డబ్బులు స్వీకరిస్తున్న సమయంలోనే ACB అధికారులు పట్టుకున్నారు.తెలంగాణ ప్రభుత్వం తరచూ లంచగొండితనాన్ని అరికట్టేందుకు ప్రజలకు పిలుపునిస్తున్న విషయం తెలిసిందే. ఎవరికైనా ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం కోరిన పక్షంలో, వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖను సంప్రదించాలని సూచించారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post