యువతరాన్ని డ్రగ్స్ నుంచి కాపాడండి- డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్.
బాబు జగజ్జివన్ రావు విగ్రహానికి వినతి పత్రం అందిస్తున్న డివైఎఫ్ఐ బృందం.
జంగారెడ్డిగూడెం, ఆగస్టు 22:- జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చాలని, యువతరాన్ని కాపాడాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం నాడు జంగారెడ్డిగూడెం బాబు జగజీవన్ రావ్ విగ్రహానికి డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి జి సూర్యకిరణ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న డ్రగ్స్ మాఫియాను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు. యువతరం డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారని తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం డ్రగ్స్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే డ్రగ్స్ కు ఎడిట్ అయ్యి యువతరం వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని దీనిపై ప్రభుత్వం అధికార యంత్రాంగం చర్యలు చేపట్టడంతో పాటు అవగాహన కల్పించాలని కోరారు. నేడు డ్రగ్స్ కారణం వల్ల యువకులు అనేక సమస్యలు తెచ్చుకుంటున్నారని అలాగే కుటుంబ కలహాలు గొడవలకు లోనయ్యి తమ జీవితాలను రోడ్డుపాలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఏజెన్సీ ప్రాంతాలలో డ్రగ్స్ పెరగడంతో కుటుంబ గొడవలు అనేక గ పెరగడం, అవి హత్యలకు దారి తీసే విధంగా ఉండడం చాలా బాధాకరమన్నారు. నేడు పత్రికా ప్రకటనలో చూస్తున్నామని తెలిపారు. యువత ఉధృతంగా డ్రగ్స్ లోనవుతున్న యువకులని సక్రమంగా సరిదిద్దె విదంగా డివై ఎఫ్ ఐ కృషి చేస్తుంది అన్నారు. డ్రగ్స్అరికట్టేందుకు అధికార యంత్రాంగంతో పాటు తల్లిదండ్రులు వారి పిల్లల నడవడిక వాళ్ల లోన్ అవుతున్న దురలవాటులను అరికట్టే విధంగా చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో, జిల్లా కమిటీ సభ్యులు ఉదయ్, పి పోతురాజు, డి నాగరాజు, వీర్రాజు, వెంకట సుబ్బారావు, సీతారాములు బి నాని ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు.

.jpeg)