గిద్దలూరులో ఆగస్టు 14న జరగాల్సిన ప్రజా సమస్యల వేదిక (PGRS) కార్యక్రమం రద్దు
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు
మార్కాపురం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో జిల్లా కలెక్టర్ మరియు గిద్దలూరు శాసనసభ్యులు శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ, శుక్రవారం నిర్వహించాల్సిన ప్రజా సమస్యల వేదిక (PGRS) కార్యక్రమం రద్దు చేయబడినట్లు తెలియజేయడమైనది.
ఆగస్టు 15వ తేదీన నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, అలాగే 22వ తేదీన వెలుగొండ ప్రాజెక్టు నీటి సరఫరా ట్రయల్ రన్ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమై ఉన్నందున, ఆగస్టు 14న నిర్వహించాల్సిన PGRS కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది.
కావున గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు, ప్రజాప్రతినిధులు మరియు సంబంధిత అధికారులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా తెలియజేయడమైనది.
తదుపరి PGRS కార్యక్రమం నిర్వహించే తేదీని త్వరలో తెలియజేయడం జరుగుతుంది
