టీడీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఇంటింటి ప్రచారం.



 టీడీపీ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఇంటింటి ప్రచారం.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గం కంభం అర్బన్ కాలనీలోని 52వ బూత్ పరిధిలో టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు.

ఎన్ఆర్ఐ రఫీ ఆధ్వర్యంలో వివిధ ఇంటింటికి వెళ్లి, టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించిన ప్రయోజనాలు, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, వాటి ద్వారా ప్రజలకు కలిగిన లబ్ధిని వివరించారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ ఎన్ఆర్ఐ సభ్యుడు సయ్యద్ రఫీ, ఆర్టీసీ మహబాషా (రైల్వే రిటైర్డ్), మైనారిటీ సెక్రటరీ మహబాషా, టీడీపీ నాయకులు రమీజా బాబు, ఈసోబ్, ఇతర టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు పార్టీ సభ్యులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను తెలియజేస్తూ, వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు మంచి స్పందన తెలిపినట్లు నిర్వాహకులు తెలిపారు..

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post