ద్విచక్ర వాహన దొంగల ముఠాను అరెస్ట్ చేసిన కంభం పోలీసులు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.
మార్కాపురం జిల్లా కంభం పోలీస్‌స్టేషన్ పరిధిలో వరుసగా జరుగుతున్న ద్విచక్ర వాహనాల ను దొంగతనం చేసినముఠాను కంభం పోలీసులు ఛేదించారు.
విలేకరుల సమావేశంలో డిఎస్పి యు నాగరాజు మాట్లాడుతూ పక్కా సమాచారంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి దాడులు నిర్వహించిన పోలీసులు 8 మంది నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి 13 దొంగతనానికి గురైన ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు .
కంభం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఇటీవల ద్విచక్ర వాహనాల దొంగతనాలు పెరగడంతో బాధితుల ఫిర్యాదుల మేరకు పోలీసులు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు.
అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టి, పక్కా సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు.
విచారణలో నిందితులు పలు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. వారి వద్ద నుంచి మొత్తం 13 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతరం నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
దొంగతనం చేసిన ద్విచక్ర వాహనాల కేసును చాకచక్యంగా ఛేదించి నిందితులను పట్టుకున్న కంభం పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
వాహన యజమానులు తమ ద్విచక్ర వాహనాలను సురక్షిత ప్రదేశాల్లో పార్క్ చేయడంతో పాటు తాళాలు, ఇతర భద్రతా చర్యల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు.
చోరీలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ప్రజలు కూడా తమ వాహనాల భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.


