రూ.21.20 లక్షలతో జల్ జీవన్ మిషన్ వాటర్ ట్యాంక్‌కు శంకుస్థాపన.
ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే లక్ష్యం: ఎమ్మెల్యే గౌతు శిరీష.
క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి శంకర్ తమ్మినాన.
వజ్రపుకొత్తూరు, ఆగస్టు 6:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో అమలవుతున్న జల్ జీవన్ మిషన్ (JJM) పథకం కింద వజ్రపుకొత్తూరు మండలం సైనూరు గ్రామంలో రూ.21.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్‌కు పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష గురువారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి ఇంటికి స్వచ్ఛమైన, సురక్షితమైన తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తున్నామని, సైనూరు గ్రామంలో నిర్మించనున్న ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ పూర్తయిన అనంతరం గ్రామంలోని ప్రతి కుటుంబానికి తాగునీరు నిరంతరాయంగా అందుబాటులోకి వస్తుందని చెప్పారు.
ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, గ్రామాభివృద్ధిలో తాగునీరు, రహదారులు, విద్య, వైద్యం వంటి రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యతతో పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి పనులను అధికారులు నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

