'హోటల్ కె స్క్వేర్' ఏలూరులో నూతన ప్రారంభోత్సవం.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
ఏలూరు, ఆగస్టు 14:
ఏలూరు హోటల్ రంగంలో నూతన అధ్యాయం మొదలైంది. ' హోటల్ కె స్క్వేర్' శుక్రవారం ఉదయం స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్ సమీపంలోని గుమ్మడి గ్రాండ్ హోటల్ ప్రక్కన ప్రారంభమైంది. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హోటల్ ను ప్రారంభించారు. ఆధునిక హంగులతో ప్రత్యేకమైన గదులు, విఐపి సూట్ లు, చక్కటి ఆతిథ్యం ఈ హోటల్ ప్రత్యేకత. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ హోటల్ అధినేతలు 'కాకరాల బ్రదర్స్ ' వ్యవసాయం, వ్యాపార, సేవా రంగాల్లో మంచి పేరు తెచ్చుకున్నారని అన్నారు. 'హోటల్ కె స్క్వేర్' నిర్మాణం విషయంలో కూడా ఎక్కడా రాజీ పడలేదన్నారు. ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఆతిథ్య రంగంలో ఎన్నో నూతన పోకడలు వస్తున్నాయని, వాటిని ' హోటల్ కె స్క్వేర్' అందిపుచ్చుకున్నదని అన్నారు. 'కాకరాల బ్రదర్స్' మరిన్ని విజయాలు సాధించి, వినియోగదారులకు సేవ చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యులు మాగంటి బాబు, ఉషా బాలకృష్ణ, ఎస్ఎంఆర్ పెదబాబు పాల్గొన్నారు. వచ్చిన అతిథులను 'కాకరాల బ్రదర్స్' సాదరంగా ఆహ్వానించి స్వాగతం పలికారు. ఇంకా ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ వ్యాపారస్తులు, పుర ప్రముఖులు, హోటల్ యజమానులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

