క్రైమ్ 9మీడియా ప్రతినిధి సన్నీ చక్రవర్తి.
ఏలూరు, ఆగష్టు, 5 : ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాల ద్వారా నాణ్యమైన బియ్యాన్ని సక్రమంగా సరఫరా జరిగేలా పర్యవేక్షించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. స్థానిక పత్తేబాద రైతుబజార్ లోని ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాన్ని బుధవారం జేసీ ఆకస్మికంగా తనిఖీ చేసి, బియ్యం పంపిణీని పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలో బియ్యం నిల్వలు, పంపిణీ చేసిన బియ్యం వివరాలను జేసీ పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ అభిషేక్ గౌడ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం మార్కెట్ ఇంటర్వెన్షన్ కార్యక్రమం ద్వారా తక్కువ ధరకు ప్రత్యేక బియ్యం విక్రయ కేంద్రాల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచిందన్నారు. సూపర్ ఫైన్ బియ్యం కిలోకు రూ. 52/-, BPT స్టీమ్ బియ్యం – కిలోకు రూ. 52/-, BPT రా (Raw) బియ్యం – కిలోకు రూ. 50/- లు చొప్పున అందించడం జరుగుతుందన్నారు. బియ్యం కొనుగోలు చేసే ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా ఆధార్ నంబరును నమోదు చేయవలెను. ప్రతి రేషన్ కార్డుకు గరిష్టంగా 10 కిలోల బియ్యం విక్రయించబడుతుందన్నారు.
