మంత్రి కొలుసు పార్థసారధిని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు.



 మంత్రి కొలుసు పార్థసారధిని మర్యాదపూర్వకంగా కలిసిన ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు.

క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన.

విజయవాడ, జులై 7: 

గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధిను ఏపీటీపీసీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వజ్జ బాబురావు మంగళవారం విజయవాడలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత సమర్థవంతంగా చేరేలా తీసుకోవాల్సిన చర్యలు, ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించే అంశాలు, ప్రభుత్వ లక్ష్యాలను గ్రామస్థాయి వరకు సమర్థంగా తీసుకెళ్లే విధానాలపై అభిప్రాయాలు పంచుకున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని వారు ప్రస్తావించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

ఈ మర్యాదపూర్వక భేటీ ఆత్మీయ వాతావరణంలో కొనసాగింది.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post