రిజిస్ట్రేషన్ స్టాంపులు ప్రైవేటీకరణ చేయవద్దని దస్తావేజు రైటర్లు నిరసన.


  రిజిస్ట్రేషన్ స్టాంపులు ప్రైవేటీకరణ చేయవద్దని దస్తావేజు రైటర్లు నిరసన.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణం రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖను ప్రైవేటీకరణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జి .ఓ .మా .స్ నెంబర్.396 అమలుకు వ్యతిరేకంగా దస్తావేజు లేఖరుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 20వ తేదీ నుండి 31వ తేదీ వరకు చేపట్టనున్న పెన్ డౌన్ కార్యక్రమం జయప్రదం చేయాలని గిద్దలూరు దస్తావేజు లేఖరుల సంఘం అధ్యక్షులు కోరే సుబ్బారావు కోరారు. సోమవారం సాయంత్రం సంఘం సెక్రటరీ గర్రె రామ్ ప్రసాద్ కార్యాలయములో జరిగిన దస్తావేజు లేఖరులు, సహాయకులు, డి.టి.పి ఆపరేటర్లు, స్టాంపు వెండర్ల సమావేశంలో అధ్యక్షులు కోరే సుబ్బారావు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రైవేటు భాగస్వామ్యం కల్పిస్తూ జీవో నెం: 396 ను ప్రభుత్వం విడుదల చేయడం వలన దస్తావేజు లేఖర్లు మరియు సహాయకులు, స్టాంపు వెండర్లు, మరియు డి.టి.పి. ఆపరేటర్లు ఉపాధి కోల్పోవాల్సి వస్తోందన్నారు. జీవో అమలులో ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా పోతుందన్నారు.

సంఘం అధ్యక్షులు కోరే సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణను, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కావున జులై 20వ తేదీ నుండి 31వ తేదీ వరకు చేపట్టిన దస్తావేజు లేఖరుల సమ్మెను జయప్రదం చేయాలని, సమ్మె విషయం అన్ని వర్గాల కక్షిదారులకు, ప్రజలకు తెలిపే విధంగా సభ్యులు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో సంఘం జాయింటు దస్తావేజు లేఖరులు, సహాయకులు,డి.టి.పి ఆపరేటర్లు,స్టాంపు వెండర్లు పాల్గొన్నారు.

దస్తావేజు లేఖరుల సంఘం గిద్దలూరు

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post