మహిళలపై నేరాల నివారణపై 'అభయ' అవగాహన.


 మహిళలపై నేరాల నివారణపై 'అభయ' అవగాహన.

మాడుగుల పోలీస్ స్టేషన్ ఎస్ఐ నారాయణరావు.

క్రైమ్9మీడియా ప్రతినిధి జోనల్ ఇంచార్జి పి మహేశ్వరావు.

అనకాపల్లి జులై:17

మహిళలపై జరుగుతున్న నేరాల నివారణ (క్రైమ్ ఎగైనెస్ట్ ఉమెన్)లో భాగంగా "అభయ” పట్ల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మాడుగుల కే. జీ.బి. వి బాలికల ఉన్నత పాఠశాలలో సీ.ఐ రామకృష్ణ ఆదేశాలు మేరకు,మాడుగుల ఎస్సై నారాయణరావు పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో గురువారం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఎస్ఐ నారాయణరావు మాట్లాడుతూ మహిళల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. మహిళలపై జరిగే వేధింపులు, ఈన్జింగ్, స్టాకింగ్, సైబర్ నేరాలు, సోషల్ మీడియా దుర్వినియోగం వంటి నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే మహిళల రక్షణకు అమలులో ఉన్న భారతీయ న్యాయ సంహిత (బి.ఎన్.ఎస్), 2023, లైంగిక వేధింపుల నిరోధక చట్టాలు, గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం, 2005 ( ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రం డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్), పోక్సో చట్టం మరియు మహిళల రక్షణకు సంబంధించిన చట్టాల గురించి వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్-112, శక్తి యాప్, "అభయ్” వంటి పోలీసు సహాయ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. అలాగే విద్యార్థులు మహిళల పట్ల గౌరవంతో వ్యవహరిం చాలని, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించాలని, ర్యాగింగ్, మాదకద్రవ్యాలు మరియు ఇతర అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచిం చారు. పాఠశాల హెచ్.ఎం. పోలీసు శాఖ చేపడుతున్న ఇటువంటి అవగాహన కార్యక్రమాలను అభినందిస్తూ, విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందిం చుకొని సమాజంలో బాధ్యతాయుతంగా మెలగాలని కోరారు. కార్యక్రమంలో అధ్యాపకులు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post