పెసరపాడులో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గౌతు శిరీష.


 పెసరపాడులో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గౌతు శిరీష.

 రూ.15 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో సీసీ రోడ్డు నిర్మాణం.

 పజా సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనే ప్రభుత్వ ధ్యేయం.

క్రైమ్ 9 మీడియా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన.

కాశీబుగ్గ జూలై 25(పలాస):

ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పలాస శాసనసభ్యురాలు శ్రీమతి గౌతు శిరీష తెలిపారు. శనివారం (25/07/2026) పలాస నియోజకవర్గం కాశీబుగ్గ-పలాస మున్సిపాలిటీ పరిధిలోని పెసరపాడుగ్రామంలో 15వ ఆర్థిక సంఘం (15th Finance Commission) నిధులు రూ. 15 లక్షల వ్యయంతో 255 మీటర్ల పొడవున కాలనీ నుండి బరేల్ గ్రౌండ్ వరకు నిర్మించనున్న నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష గమాట్లాడుతూ:

పట్టణాలు, గ్రామాల్లో రహదారులు, తాగునీరు, పారిశుధ్యం వంటి ప్రాథమిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. పెసరపాడులో ఈ సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయితే స్థానిక ప్రజలకు రాకపోకలు సౌకర్యవంతంగా మారడమే కాకుండా, వర్షాకాలంలో ఎదురయ్యే బురద, నీటి నిల్వ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.

పలాస నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబురావు ఏఎంసీ చైర్మన్ మల్లా శ్రీనివాసరావుబీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి లోడగల కామేష్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పీరికట్ల విఠల్ పలాస మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు, స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post