రెండేళ్ల అభివృద్ధి – సంక్షేమ ఫలితాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం: ఎమ్మెల్యే గౌతు శిరీష.




 రెండేళ్ల అభివృద్ధి – సంక్షేమ ఫలితాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం: ఎమ్మెల్యే గౌతు శిరీష.

క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి శంకర్ తమ్మినాన.

మందస, జూలై 29: పలాస నియోజకవర్గం మందస మండల కేంద్రంలో నిర్వహించిన "రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం" డోర్ టు డోర్ కార్యక్రమంలో పలాస శాసనసభ్యులు శ్రీమతి గౌతు శిరీష పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించిన ఆమె, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించడంతో పాటు గ్రామస్తుల సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ, గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి చేరవేసి, ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం కావడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రజల అభిప్రాయాలు, సూచనలు తెలుసుకుని పాలనను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలు, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.

గ్రామాభివృద్ధిలో భాగంగా తాగునీరు, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి అవసరాలు తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయడమే డోర్ టు డోర్ కార్యక్రమం లక్ష్యమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు, మందస పీఏసీఎస్ చైర్మన్, క్లస్టర్ కన్వీనర్లు, కో-కన్వీనర్లు, యూనిట్ కన్వీనర్లు, యూనిట్ కో-కన్వీనర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post