SIR ప్రక్రియ విజయవంతానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలి: వజ్జ బాబూరావు.



 SIR ప్రక్రియ విజయవంతానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలి: వజ్జ బాబూరావు.

క్రైమ్ 9 మీడియా శ్రీకాకుళం జిల్లా ప్రత్యేక ప్రతినిధి శంకర్ తమ్మినాన.

పలాస, జూలై 8: 

ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించి ప్రతి అర్హ ఓటరు వివరాలు జాబితాలో నమోదయ్యేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని ఏపీటీపీసీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి వజ్జ బాబూరావు అన్నారు.

పలాస పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయి నాయకులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. SIR ప్రక్రియ అమలుపై వార్డు, బూత్ వారీగా సమీక్ష నిర్వహించి క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు.

ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని బాబూరావు తెలిపారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అర్హులందరి వివరాలు సక్రమంగా నమోదు అయ్యేలా నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

SIR ప్రక్రియలో పారదర్శకత, సమర్థతకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి బూత్‌లో నాయకులు అప్రమత్తంగా ఉండి ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని పిలుపునిచ్చారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సందేహాలను నివృత్తి చేసి ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు.

ఈ సమావేశంలో పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని క్లస్టర్, యూనిట్, బూత్ స్థాయి నాయకులు, కన్వీనర్లు, కో-కన్వీనర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post