నాడు చేసిన కృషి... నేడు ఫలితం.



 నాడు చేసిన కృషి... నేడు ఫలితం.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన 

మందస పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో ఒకటైన డివైడర్లలో పేరుకుపోయిన చెత్త తొలగింపు అంశంపై ప్రజల తరఫున పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన నేపథ్యంలో, ఈరోజు సంబంధిత అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి డివైడర్లలో పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించే కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని అధికారులు స్వయంగా పర్యవేక్షిస్తూ చేపట్టడం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యపై స్పందించి చర్యలు తీసుకున్న మందస ఎంపీడీవో గారికి, పంచాయతీ ఈవో గారికి, అలాగే గౌరవ ఎమ్మెల్యే గారికి మందస ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

అలాగే సమస్య పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసిన వెంకన్న చౌదరి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ అంశంపై జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గారు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా, తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షుడు కృష్ణ గారు కూడా సమస్య పరిష్కారానికి నిరంతరం కృషి చేశారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి చేసిన ప్రయత్నాల ఫలితంగానే ఈరోజు సానుకూల ఫలితం కనిపించిందని స్థానికులు పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యల పరిష్కారానికి ఇదే విధంగా అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు కలిసి పనిచేయాలని కోరుతూ, సహకరించిన ప్రతి ఒక్కరికీ మందస ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

— మందస ప్రజల తరఫున

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post