అంతర్‌రాష్ట్ర బైక్ దొంగ అరెస్ట్.



 అంతర్‌రాష్ట్ర బైక్ దొంగ అరెస్ట్.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.

రూ.25 లక్షల విలువైన 13 మోటార్ సైకిళ్ల స్వాధీనం.

పలాస, జూన్ 22:

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మూడు బైక్ దొంగతనాలు సహా వివిధ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో జరిగిన మొత్తం 11 దొంగతనాల కేసులను ఛేదించిన కాశీబుగ్గ పోలీసులు అంతర్‌రాష్ట్ర బైక్ దొంగను అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి రూ.25 లక్షల విలువైన 13 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

ఏ.ఎస్పీ. పి.శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో మాట్లాడుతూ నాతమిరి రఘునాధన్ (31), తండ్రి లేట్ రామచంద్ర ప్రాధాన్, పెదంచల గ్రామం, రెంటికోట పోస్టు, పలాస మండలానికి చెందిన వ్యక్తి. ఇంటర్ వరకు చదివిన రఘునాధన్ అనంతరం వెల్డింగ్ పనులు నేర్చుకొని బెంగళూరు, అబుదాబి ప్రాంతాల్లో పనిచేశాడు. 2019లో స్వగ్రామానికి తిరిగి వచ్చి, అనంతరం విశాఖపట్నం పరవాడ ప్రాంతంలోని ఫార్మా కంపెనీలో 2021 వరకు వెల్డర్‌గా పనిచేశాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన అతడు బైక్ దొంగతనాలకు పాల్పడుతూ వాటిలో కొన్నింటిని విక్రయించి, మరికొన్నింటిని స్వయంగా వినియోగిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది.

కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌లో పలాసలోని వివేకానంద కాలనీలో నివాసం ఉంటున్న కొర్రాయి షణ్ముఖరావు శ్యామసుందరరావు (39) ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన AP30AS5111 నంబర్ గల రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ మోటార్ సైకిల్‌ను మే 30, 2026 రాత్రి తాళం విరగగొట్టి దొంగిలించనందున జూన్ 19న నమోదైనా కేసు ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేపట్టిన కాశీబుగ్గ సీఐ ఎన్ని రామకృష్ణకు అందిన సమాచారం మేరకు కంబరిగాం జంక్షన్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈసందర్భంగా AP30AS5111 నంబర్ గల రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌పై సంచరిస్తున్న రఘునాధన్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, అతడు వివిధ ప్రాంతాల్లో చేసిన బైక్ దొంగతనాలను ఒప్పుకున్నాడు.

విచారణలో భాగంగా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు, నరసన్నపేట, ఆమదాలవలస, విజయనగరం వన్‌టౌన్, అనకాపల్లి, విశాఖ హార్బర్, పరవాడ, మల్కాపురం పోలీస్ స్టేషన్‌ల పరిధిలో ఒక్కోటి చొప్పున, అలాగే ఒడిశా రాష్ట్రంలోని జరడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనాలకు సంబంధించిన మొత్తం 13 మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రఘునాధన్ గతంలో కూడా 18 దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉండగా, 2024 సెప్టెంబర్ 29న పర్లాఖిమిడి పోలీసులచే అరెస్టై విశాఖపట్నం సెంట్రల్ జైలుకు వెళ్లాడు. అనంతరం 2026 జనవరి 8న జైలు నుంచి విడుదలయ్యాడు. విడుదలైన తర్వాత మళ్లీ దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

ఈ కేసును ఛేదించడంలో కాశీబుగ్గ సీఐ, ఎస్సైలు, మందస సి ఐ,ఎస్ ఐ లు మరియు కానిస్టేబుళ్లు కీలక పాత్ర పోషించారు. నిందితుడిని అరెస్టు చేసి కేసును విజయవంతంగా ఛేదించిన పోలీసు బృందాన్ని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి అవార్డులు ప్రకటించారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post