దళితుల స్మశాన భూములను ఆక్రమించిన వారిపై ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం. జనసేన నాయకులు.


 దళితుల స్మశాన భూములను ఆక్రమించిన వారిపై ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం. జనసేన నాయకులు.

ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

మార్కాపురం జిల్లా, పొదిలి మండలం, పోతారం గ్రామంలోని దళితుల స్మశాన వాటిక ఆక్రమణకు గురైన విషయాన్ని గ్రామానికి చెందిన దళిత సోదరులు జనసేన నాయకులు జహీర్ దృష్టికి తీసుకువచ్చారు. సమస్య తీవ్రతను గుర్తించిన జహీర్.వెంటనే స్పందించి ఆక్రమణకు గురైన స్మశాన వాటిక ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా జహీర్ మాట్లాడుతూ, దళితుల హక్కులను కాలరాసే విధంగా స్మశాన వాటిక భూములను ఆక్రమించడం అత్యంత దురదృష్టకరమని అన్నారు. దళితులకు చెందిన స్మశాన వాటికను కాపాడటం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత అని పేర్కొన్నారు. ఆక్రమణకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్, జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు.

అలాగే ఆక్రమణదారులపై తక్షణ చర్యలు తీసుకొని, స్మశాన వాటిక భూమిని దళితులకు తిరిగి అప్పగించే వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. దళితుల ఆత్మగౌరవం, హక్కుల పరిరక్షణ కోసం జనసేన పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.

పోతారం గ్రామ దళితులకు న్యాయం జరిగే వరకు ఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చట్టబద్ధంగా పోరాడతామని హల్చల్ జహీర్ తెలిపారు. “దళితుల హక్కులపై ఎలాంటి అన్యాయం జరిగినా సహించేది లేదు – న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదు” అని పేర్కొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post