పదోన్నతితో ప్రజలకు మెరుగైన ఉత్తమ పోలీసింగ్ సేవలను అందించాలి: ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి.
ప్రకాశం జిల్లా పోలీస్ శాఖలో ఎస్.ఐలుగా విధులు నిర్వహిస్తూ సి.ఐలుగా పదోన్నతి పొందిన వారు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., ని మర్యాదపూర్వకంగా కలిశారు. ముగ్గురు ఎస్సైలు కె. కమలాకర్ (CCS పిఎస్), యం. మురళి (దర్శి పిఎస్), యు. వెంకటకృష్ణయ్య(టాస్క్ ఫోర్స్, ఒంగోలు) పదోన్నతి పొందారు.
ఈ సందర్బముగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సి.ఐలుగా పదోన్నతి పొందడం బాధ్యతను మరింత పెంచుతుందని, సి.ఐ.గా విధి నిర్వహణలో అంకిత భావముతో, నిబద్దత మరియు నిజాయితీతో ప్రజలకు సుధీర్ఘమైన సేవలు చేస్తూ, పోలీస్ శాఖ గౌరవం, ప్రతిష్ట పెరిగే విధంగా ఎటువంటి రిమార్క్స్ లేకుండా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నతాధికారుల మన్ననలు అందుకోవాలన్నారు. భవిష్యత్ లోనూ ప్రజలకు మెరుగైన ఉత్తమ పోలీసింగ్ సేవలను అందించాలని ఆకాక్షించారు.
