కరుణాకర్, శ్రీరామ్, రాఘవేంద్ర లకు డీఎస్పీ లుగా పదోన్నతి.
మార్కాపురం. సీఐ లు గా పనిచేస్తున్న పాపిశెట్టి కరుణాకర్, వి. శ్రీరామ్, కెవి రాఘవేంద్ర రావు లకు డిప్యూటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) లుగా పదోన్నతి లభించింది.
నేడు ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరి కార్యాలయం నుండి అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఈ ముగ్గురు అధికారులు మార్కాపురం జిల్లాలోని పలు ప్రాంతాల్లో సుధీర్ఘ కాలం పాటు పోలీసు శాఖలో పనిచేశారు. ఈ సందర్భంగా సమర్ధవంతమైన అధికారులుగా మంచి పేరు తెచ్చుకున్నారు.
ముఖ్యంగా ప్రజలతో మమేకమై పనిచేయడంతో ఈ ప్రాంతంలో గ్రామ గ్రామాన అన్ని రాజకీయ పార్టీలు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, నాయకులతో పాటు ప్రజలతో క్షేత్ర స్థాయిలో సన్నిహిత సంబంధాలు కలిగి వుండడం విశేషం.
కరుణాకర్ మార్కాపురం రూరల్, బెస్తవారిపేట మండలాల్లో ఎస్ ఐ గా, మార్కాపురం సీఐ గా పనిచేశారు.
ట్రైనింగ్ ఎస్ ఐ గా మార్కాపురం పట్టణంలో ప్రస్థానాన్ని ప్రారంభించిన శ్రీరామ్ అనంతరం దోర్నాల, మార్కాపురం పట్టణ ఎస్ ఐ గా, గిద్దలూరు,మార్కాపురం సీఐ గా బాధ్యతలను నిర్వర్తించారు. అలాగే రాఘవేంద్ర రావు కూడా దోర్నాల,దర్శి,మార్కాపురం పట్టణ ఎస్ ఐ గా, సీఐ గా బాధ్యతలను నిర్వర్తించారు.
గతంలో ఈ ముగ్గురు అధికారులు మార్కాపురం జిల్లాలో గతంలో నెలకొన్న సంక్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో శాంతి భద్రతలను కాపాడే విషయంలో ఎంతో సమర్థవంతంగా పనిచేశారనే గుర్తింపు ప్రజల్లో వుంది.
ఆయా సందర్భాల్లో వాళ్ళు ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం నుంచి ప్రశంస పత్రాలు కూడా అందుకోవడం జరిగింది.
ప్రస్తుతం కరుణాకర్ గుంటూరు జిల్లాలో రైల్వే శాఖ లో సిఐ గాను, శ్రీరామ్ ఇంటలిజెన్స్ సీఐ గా, రాఘవేంద్ర స్పెషల్ బ్రాంచి సీఐ గా ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విధులను నిర్వర్తిస్తున్నారు.
ఈ ముగ్గురికి డీఎస్పీ లుగా ఎప్పుడో పదోన్నతి రావాల్సిందివుంది.
వివిధ కారణాల వల్ల చాల ఆలస్యంగా వచ్చింది.
ఏది ఏమైనప్పటికీ ఇప్పటికైనా ఈ త్రిమూర్తులకు డిఎస్పీ లుగా పదోన్నతి లభించడంతో మార్కాపురం జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
