వంశధార కాలువ మరమ్మత్తు పనులకు ఎమ్మెల్యే గౌతు శిరీష శ్రీకారం.



 వంశధార కాలువ మరమ్మత్తు పనులకు ఎమ్మెల్యే గౌతు శిరీష శ్రీకారం.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.

పలాస, మే 15:

వజ్రపుకొత్తూరు మండలం రిట్టపాడు గ్రామ సమీపంలో వంశధార కాలువ మరమ్మత్తు పనులకు పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి గౌతు శిరీష శుక్రవారం ప్రారంభోత్సవం చేశారు. ఇరిగేషన్ శాఖ ద్వారా సుమారు రూ.60 లక్షల నిధులతో చేపట్టనున్న ఈ పనులకు ఆమె శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌతు శిరీష మాట్లాడుతూ, రైతులకు సాగునీరు సక్రమంగా అందేలా కాలువల మరమ్మత్తులు అత్యంత అవసరమని అన్నారు. వంశధార కాలువ ద్వారా పరిసర గ్రామాల రైతులకు సాగునీటి సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు. రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకొని కాలువల పునరుద్ధరణ పనులను ప్రాధాన్యతతో చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

కాలువ మరమ్మత్తు పనులు నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. సాగునీటి పంపిణీలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నీటి సంఘం నాయకులు, మున్సిపాలిటీ నాయకులు, మండల నాయకులు, మహిళలు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post