కంభంలోని పలు ప్రాంతాల్లో పవర్ కట్.


  కంభంలోని పలు ప్రాంతాల్లో పవర్ కట్.

 మార్కాపురం జిల్లా కంభం పట్టణంలోని పలు ఏరియాల్లో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏఈ వెంకట నరసయ్య ఓ ప్రకటన ద్వారా తెలిపారు. లైన్ కన్వర్షన్, ఇన్ లైన్ పోల్స్ తదితర మరమ్మత్తుల కారణంగా పట్టణంలోని పూసల బజార్ ప్రాంతంలో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందన్నారు. ఈ అంతరాయానికి ప్రజలు సహకరించాలని ఆ శాఖ ఏఈ కోరారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post