శర వేగంగా 22(ఏ) భూముల దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలిస్తున్న ప్రకాశం డి ఆర్ వో.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా లో నిషేధిత 22(ఏ) జాబితాలోని భూముల సమస్యను త్వరగా పరిష్కరించే దిశగా జిల్లా అధికార యంత్రాంగ చర్యలు వేగవంతం చేసింది.
తమ భూముల వివరాలు పొరపాటున ఈ జాబితాలో చేరాయని, వీటిని పరిష్కరించాలని మూడు డివిజన్లలో కలిపి జిల్లావ్యాప్తంగా 591 దరఖాస్తులు వచ్చినట్లు డిఆర్ఓ .బి.చిన ఓబులేసు తెలిపారు.
ఆర్డీవోలు, సబ్ కలెక్టర్ ద్వారా వీటిని జిల్లా కేంద్రానికి తెప్పిస్తున్నామని చెప్పారు. గురువారం నాటికి 439 వచ్చినట్లు వివరించారు. వీటిని జిల్లా కలెక్టర్ .పి.రాజాబాబు ఆదేశాల మేరకు ప్రతివారం కలెక్టరేట్లో తహసీల్దారులతో తాను వెరిఫికేషన్ చేయిస్తున్నట్లు చెప్పారు. వచ్చిన దరఖాస్తులు పెండింగ్ లేకుండా త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలియజేశారు

