జన్ భాగిదారి – “సబ్సే దూర్… సబ్సే పహలే” కార్యక్రమం విజయవంతం.



 జన్ భాగిదారి – “సబ్సే దూర్… సబ్సే పహలే” కార్యక్రమం విజయవంతం.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.

పలాస మండలంలోని లోత్తూరు గ్రామంలో ఈ రోజు “జన్ భాగిదారి – సబ్సే దూర్… సబ్సే పహలే” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ గారు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరవేయడం ప్రధాన లక్ష్యమని తెలిపారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు మరియు నిరుపేద కుటుంబాలకు అందుతున్న పథకాల వివరాలను క్లుప్తంగా వివరించారు.

అనంతరం గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ సేవలు, అభివృద్ధి కార్యక్రమాలు మరియు సంక్షేమ పథకాలపై ప్రజలకు చైతన్యం కల్పించారు. ఈ ర్యాలీలో అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, యువత మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని ఎంపీడీఓ గారు తెలిపారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడినందుకు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

Post a Comment

Please Select Embedded Mode To Show The Comment System.*

Previous Post Next Post