మహా ప్రభో మా బిడ్డకు న్యాయం చెయ్యండి.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి శ్రీకాకుళం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శంకర్ తమ్మినాన.
మా బిడ్డకు న్యాయం చెయ్యండి మహాప్రభో అంటూ అనుమానాస్పస్పద మృతికి గురైన మృతుడు మువ్వల నగేష్ కు చెందిన మత్స్యకార కుటింబీకులు, గ్రామస్తులు కలసి మరోసారి మీడియా ముందుకొచ్చారు.శ్రీకాకుళం జిల్లా పలాస లో ప్రముఖ న్యాయవాది దువ్వాడ శ్రీధర్(బాబా)తన నివాసంలో ఏర్పాటు చేసిన. మీడియా సమావేశంలో బాధిత కుటింబీకులు హాజరై మీడియా ముందు తమగోడు వినిపించారు.
వాయిస్ ఓవర్:
ఈసందర్బంగా మృతుని కుటింబీకులు మాట్లాడుతూ...
2021 లో మువ్వల నగేష్ అనే నువ్వలరేవు గ్రామానికి చెందిన మత్స్యకార యువకుడు శ్రీకాకుళం లోగల ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతుండగా అతి దారుణంగా హత్య చేయబడ్డాడని తెలిపారు.అభం శుభం తెలియని తమ బిడ్డను కాలేజీ ఆవరణలోనే హత్యచేసి నిప్పంటించారని బోరున విలపించారు.కాలేజీ యాజమాన్యం తప్పుడు పోస్టుమార్టం సృష్టించి మసిపూసి మారేడుకాయ చేశారని ఆరోపించారు.
మువ్వల నగేష్ మృతిచెందాడన్న విషయాన్ని తెలుసుకున్న తాము గ్రామస్తులతో కలసి కాలేజీ కి వెళ్లామని,అక్కడ రక్తపుమరకలు చూసి పరిస్థితిని అంచనా వేసామన్నారు.
ఇదే నేపథ్యంలో అప్పటి మంత్రి సీదిరి అప్పలరాజును కలసి తమ గోడు వినిపించినా ఫలితం లేకపోయిందని వాపోయారు.
2024 ఎన్నికల సమయంలో నారా చంద్రబాబు నాయుడు,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోపాటు నారా లోకేష్ ను కలసి తమ గోడు వెళ్లగక్కుకున్నా ఫలితం సూన్యమైందన్నారు.తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మువ్వల నగేష్ కుటుంబానికి న్యాయం చేస్తామని మాటిచ్చి మరిచారని కన్నీరు మున్నీరుగా విలపించారు.ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని వారు కోరారు.
ప్రముఖ న్యాయవాది దువ్వాడ శ్రీధర్ మాట్లాడుతూ....
మృతుడు మువ్వల నగేష్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు.ఎమ్మెల్యే గా గెలుపొంది నేటికి 2 సంవత్సరాలు పూర్తయ్యాయని,ఇప్పటివరకు పలాస కు ఏం చేశారో చెప్పగలరా అని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ను ప్రశ్నించారు. నువ్వలరేవు గ్రామం నుండి సుమారు 4500 ఓట్లు తో గెలిచి వారికేమి న్యాయం చేశారో చెప్పాలన్నారు.తమలాంటి వారు ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తారని,అయితే తాము కేసులకు భయపడేవారిమి కామన్నారు.మువ్వల నగేష్ అనే చిన్న కుర్రాడి విషయంలో న్యాయం చేయలేకపోతున్నారు అంటే పేదోడికి న్యాయం చేయరా అని సూటిగా ప్రశ్నించారు.తాను ప్రశ్నిస్తున్నందుకు తమ భార్య,పిల్లలు తోపాటు తన తల్లి పై కూడా సోషల్మీడియాలో అసభ్యకర పోస్టులుపెట్టి మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తనపై ఎన్ని కేసులు పెట్టుకున్నా భయపడేదిలేదన్నారు.తప్పనిసరిగా మువ్వల నగేష్ కుటుంబానికి న్యాయం చేయాలని దువ్వాడ శ్రీధర్ డిమాండ్ చేశారు.

