పొదిలిలో భగ్గుమన్న టిడిపి వర్గీయుల విభేదాలు.నడిరొడ్డుపై నాయకుల బాహబాహి.
ఉమ్మడి ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ఎమ్మెల్యే కందుల సమక్షంలోనే ప్రారంభమైన వివాదం.
విస్మమయం వ్యక్తం చేస్తున్న ప్రజలు
స్వచ్చరధం పై రచ్చ.
మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలో బహిరంగంగానే టిడిపి నాయకులు బాహబాహి తలపడ్డారు
వైసిపికి చెందిన వ్యక్తికి స్వచ్చ రధం ఇచ్చారని ఒక నాయకుడు ఎమ్మెల్యే దృష్టికి తీసుకరాగా మళ్ళి మాట్లాడదం అని చెప్పి పంపారు.
నాయకులు బయటకు వచ్చి ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటు చిలికిచిలికి వివాదంగా మారి చివరికి బహబాహితలపడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఈ వివాదంలో ఇద్దరు టిడిపి సినియర్లు ఒకరునొకరు కొట్టుకున్నారు.
బహిరంగంగా ఈ విధంగా కొట్టుకకుంటుండటంతో ప్రక్కన ఉన్న కార్యకర్తలు, పొలీసులు ప్రక్కకు లాగి సర్ది చెప్పి పంపారు.
మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి శంకర కంటి వైద్య శిభిరం ప్రారంభించాడానికి పొదిలికి వచ్చారు. పర్యటనలో భాగంగా స్వచ్చ రధం కుడా ప్రారంభించారు.
ఈ వివాదం అక్కడ ప్రారంభమై ఎమ్మెల్యే వెళ్ళిన తరువాత బాహబాహి తలపడిన పరిస్థితి నెలకొంది.
ఈ వివాదాలకు ఎమ్మెల్యే చెక్ పెట్టకపొతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొవలసి వస్తుందని స్దానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
.jpg)
